పవన్ కల్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్న పేరు ఇది. గత కొంత కాలంగా ఆయన పేరుపై ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే వాటిని పవన్ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక ఆయన ఆస్తుల వివరాలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ప్యాకేజీలతో ఆయన వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడని చాలామంది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పవన్ ఆస్తులు ఎన్ని కోట్లో చెప్పేశాడు నాగబాబు . ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సినిమాల్లో డబ్బులు సంపాదించి అందులో కొంత తాను ఉంచుకుని మిగతా మొత్తం ప్రజలకే ఇచ్చేస్తాడు. తనకంటూ ఆస్తులు వెనకేసుకోడు. ఇప్పటికే చాలా సార్లు ఇచ్చేశాడు.
పార్టీకి, ప్రజలకు, హుద్ హుద్ తుఫాన్ లాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు లేకపోతే వ్యక్తిగతంగా ఆయన వద్దకు వచ్చే వారికి, అలాగే ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, ఇప్పటం ప్రజలకు, ఉద్దానం కిడ్నీ బాధితులకు, ఇప్పుడు కౌలు రైతులకు ఇలా సాయం చేస్తూనే ఉంటాడు. వంద ఎకరాలు కొంటే.. సినిమాలు చేయడం ఆపేస్తే ఆయన దగ్గర డబ్బులు ఉండవు. కేవలం సినిమాల ద్వారానే పవన్ కల్యాణ్ సంపాదించు కుంటాడు. అంతకు మించి ఆయనకు పెద్దగా ఆదాయ మార్గాలు లేవు. అప్పట్లో మాదాపూర్ లో ఎకరం లక్ష రూపాయలు ఉన్న సమయంలో పవన్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఆయన తలచుకుంటే అప్పుడే వంద ఎకరాలు కొనేవాడు. దాంతో ఇప్పుడు వేలకోట్ల ఆస్తి ఉండేది. కానీ పవన్‌కు డబ్బులపై ప్రేమ లేదు. వేల కోట్ల ఆస్తులు ఉంటే ప్రజలకు సేవ చేయలేం అని పవన్ భావిస్తాడు. అందుకే ఆయన ఆస్తులు కూడబెట్టుకోలేదు. సినిమాలు ఆపేస్తే పవన్ దగ్గర డబ్బులు ఉండవు. ప్రజలకు పంచడానికే ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. అయితే ఆయన మాటలు నమ్మే విధంగా లేవంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు రూ.50 కోట్లకు పైగా తీసుకునే పవన్‌కు ఆస్తులు లేవా అని కామెంట్లు చేస్తున్నారు.