CINEMA

మంచు ఫ్యామిలీ మీద దారుణమైన కౌంటర్ వేసిన చిరంజీవి.

గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి అస్సలు పడట్లేదు. ముఖ్యంగా మా అసోసియేషన్‌ ఎలక్షన్ల నుంచే ఈ రెండు ఫ్యామిలీల నడుమ దారుణంగా వార్‌ నడుస్తోంది. కాగా అప్పటి నుంచే మంచు ఫ్యామిలీ మీద కూడా దారుణంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఒక రకంగా ఈ ట్రోల్స్‌కు కారణం మెగా ఫ్యామిలీ అంటూ మంచు ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరు ఇన్‌ డైరెక్టుగా కౌంటర్ వేశాడని అంటున్నారు. తాజాగా ఆయన నటించిన మూవీ వాల్తేరు వీరయ్య . సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ కొట్టింది. వీరిసింహారెడ్డి కంటే ఒక రోజు తర్వాత వచ్చినా సరే బాలయ్య మూవీని మించి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.200కోట్ల వసూళ్లు రాబట్టిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

ఆయన స్టైల్ లోనే.. అయితే తాజాగా ఈ మూవీ సక్సస్‌ ప్రమోషన్‌ లో భాగంగా బాబీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీలో జంబలకిడి జారుమిఠాయా పాట పెట్టడానికి కారణం చిరంజీవి గారే. ఆయనే స్వయంగా ఈ పాటను పెట్టమని మాకు చెప్పారు. ఆయన స్టైల్‌ లో నేను లుంగీ ఎత్తుతా చూడు.. నేను లుంగీ ఎత్తుతా చూడు అంటూ పాడారు. ఆయన చెప్పకపోతే మేం ఆ పాటను పెట్టేవాళ్లం కాదు అంటూ చెప్పాడు బాబీ. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా కూడా కావాలనే చిరంజీవి ఆ పాటను పెట్టింది మంచు ఫ్యామిలీ మీద కౌంటర్‌ వేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ జారు మిఠాయా పాటను జిన్నా మూవీలో మంచు ఫ్యామిలీ పాడించిన సంగతి తెలిసిందే.