CINEMA

బాబోయ్ నానిని వెండి తెరపై ఇలా చూడగలమా భయ్యా?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన నాచురల్ స్టార్ నాని యొక్క దసరా చిత్రం టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని ముందే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నాని లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటి వరకు చూడని నానిని ఈ సినిమాలో చూడబోతున్నామంటూ దర్శకుడు చెప్పగానే చెప్పాడు. టీజర్ లో నాని ని అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యే విధంగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదేలా చూపించాడు.

బొగ్గు గనుల మధ్య మసి పూసుకొని లుంగీ కట్టి, నల్ల చొక్కా తో నాని ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు, నోట్లో బీడీ, జుట్టు మరియు గడ్డం పెరిగి మరీ ఇంత మాస్ గా నాని ని వెండి తెరపై చూడగలమా అంటూ ఆయన అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. నాని ని సాఫ్ట్ గా చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. అలాంటిది మరీ ఇంత మాస్ లుక్ లో కనిపిస్తే నాని అభిమానులు చూడగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దసరా సినిమా ఎలా ఉంటుంది.. నాని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.