CINEMA

బాలీవుడ్ సినిమా రామ్ చరణ్ కామేయో…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే చరణ్ కి నార్త్ సెలబ్రిటీస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో రామ్ చరణ్ కి క్లోజ్ రిలేషన్ ఉంది. ఇటివలే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చెయ్యడానికి కూడా ఈ స్నేహమే కారణం. ఇప్పుడు అదే స్నేహం చరణ్ ని బాలీవుడ్ సినిమాలో క్యామియో ప్లే చేసేలా చేస్తోంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా తెరకెక్కుతోంది. వెంకటేష్ స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో చరణ్ ఒక సాంగ్ లో కనిపించనున్నాడని సమాచారం.

 

సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్, భూమిక చావ్లా పైన డిజైన్ చేసిన ‘బిల్లి బిల్లి’ అనే సాంగ్ ఇటివలే రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లోనే చరణ్ కనిపించబోతున్నాడు. RC 15 మూవీ రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో చరణ్ నార్త్ సినీ అభిమానులని పలకరించే అవకాశం దొరుకుతుంది. చరణ్, సల్మాన్, వెంకటేష్ లు ఒక ఫ్రేమ్ లో కనిపించడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించడం గ్యారెంటీ. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ఈ రంజాన్ ని ఆడియన్స్ ముందుకి రానుంది.