CINEMA

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమా నుండి పవన్ లుక్ లీక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు. ఇక గత నెల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ దేవుడుగా కనిపిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవుడున్నాడు అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారట. ఇక పవన్ మిగతా సినిమాలను పక్కన పెట్టి ముందు ఈ సినిమాను ముగించాలని చూస్తున్నాడు. ఎందుకంటే పవన్ అతి తక్కువ కాల్షీట్స్ ఇచ్చిన సినిమా ఇదే. అందుకే త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు.

 

పెద్ద సినిమా ఎక్కడ షూట్ చేస్తున్నారా..? అక్కడ కెమెరాలు పెట్టేస్తాం.. మొబైల్ ఫోన్స్ తో ఊడిపోతాం అన్నట్లు ఉంటారు కొంతమంది. హీరో లుక్, సీన్స్ ను రహస్యంగా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో లీకులు పెట్టేస్తారు. ఈ సమస్యను ప్రతి స్టార్ హీరో ఎదుర్కొంటున్నాడు. తాజాగా పవన్- తేజ్ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఇంకా సగం షూటింగ్ కూడా అవ్వలేదు అప్పుడే పవన్ లుక్ అంటూ ఇంటర్నెట్ లో లీకు ఫోటోలు వదిలేశారు. ఇక ఈ ఫోటోలో పవన్ వెనుక తేజ్ నిలబడి ఉన్నాడు. పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించగా.. అతని వెంకునా తేజ్ డాక్టర్ డ్రెస్ లో కనిపించాడు. అయితే పవన్ ను దేవుడు అన్నారు కదా.. ఈ ఫొటోలో ఆలా కనిపించడం లేదే.. అని అంటున్నారు అభిమానులు. గోపాల గోపాల చిత్రంలో కూడా పవన్ దేవుడిలానే కనిపించాడు. కానీ, అందులో కూడా మోడ్రన్ దేవుడిలానే దర్శనమిచ్చాడు. ఇక ఇందులో అల్ట్రా మోడ్రన్ దేవుడు లా దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.మరి ఈ రీమేక్ సినిమా తెలుగులో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.