CINEMA

ఇంట్రెస్టింగ్ స్టోరీతో నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్…

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మధ్యనే ఈ మూవీ చివరి షెడ్యూల్ షూట్‌ కూడా జరిగింది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా అందాల భామ కృతి శెట్టి నటిస్తోంది.

 

తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చైతన్య కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మరోసారి చైతు తన నటనతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. . ఈ టీజర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది.

 

నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించిన కస్టడీ గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్ప్స్ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు విడుదలైన టీజర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది.