CINEMA

రూ.15 కోట్లు కట్టాల్సిందే.. హీరో విశాల్‌ కు హైకోర్టు ఆదేశాలు..!

హీరో విశాల్‌ మరోసారి వివాదంలో నిలిచాడు. ఆయన రూ.15 కోట్లు కట్టాల్సిందే అని లేదంటే ఆయన సినిమాలను నిషేధిస్తామంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దాంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. గతంలో హీరో విశాల్‌ తన నిర్మాణ సంస్థ కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ దగ్గర రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు.

ఈ అప్పును లైకా సంస్థ చెల్లించింది. కాగా ఈ అప్పు మొత్తం చెల్లించే వరకు విశాల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తమకే ఇచ్చేలా లైకా సంస్థ ఒప్పందం చేసుకుంది. కానీ
విశాల్
.. తన మూవీ ‘వీరమే వాగై సూడుం’ రూల్స్ బ్రేక్ చేస్తూ రిలీజ్ చేశారు. దాంతో లైకా సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది.

ఆ సమయంలో కోర్టు కూడా మూడు వారాల్లో రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని విశాల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో జమ చేయాలని చెప్పింది. అయితే లైకా సంస్థ వల్లే తాను అప్పులు చెల్లించలేకపోయానని విశాల్ కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత తీర్పును సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేశారు.

తాజాగా అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, .