CINEMA

కేవలం 22 మ్యాచ్‌లకే కెరీర్ ఎండ్.. సీన్ కట్ చేస్తే రాజకీయాల్లో సూపర్ హిట్..

చాలా మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే.. అందులో కొందరి ప్లేయర్స్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని మ్యాచులు మాత్రమే ఆడి.. టీమిండియా నుంచి ఔట్ అయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కథ కూడా ఇదే. అతను టీమ్ ఇండియా తరఫున 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు.

అశోక్ దిండా క్రికెట్ కెరీర్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను కోల్‌కతాలోని మొయినా అనే చిన్న గ్రామ నివాసి. 2004-2005లో కోల్‌కతాలోనే తన బౌలింగ్ కు మెరుగులు దిద్దుకున్నాడు. కోచ్‌కి అతని బౌలింగ్‌ బాగా నచ్చింది. అనతికాలంలోనే రంజీ జట్టులో చోటు సంపాదించి.. ఆ తర్వాత టీమ్ ఇండియాలోనూ అవకాశం దక్కించుకున్నాడు.

అశోక్ దిండా టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతనికి 3 ఓవర్లు వేసే అవకాశం లభించింది. అతను 1 వికెట్ తీశాడు. అయితే.. మూడు ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నాడు. (BCCI)

అశోక్ దిండా అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడితే.. అతను కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దిండా 13 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 12, టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. దిండా తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ వంటి జట్లకు ఆడాడు. (BCCI)

2013 తర్వాత దిండాకు టీమ్ ఇండియాలో అవకాశం రాలేదు. 2021 సంవత్సరంలో.. దిండా క్రికెట్ నుండి రిటైర్ అయ్యి రాజకీయాల్లోకి ప్రవేశించారు. బెంగాల్ శాసనసభ 2021లో మొయినా స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. దిండా ఇప్పుడు ఎమ్మెల్యే.