CINEMA

”ది కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు

”ది కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు.

అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ పరువు తీసినందుకు నోటీసులు పంపారు. ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం మమతాబెనర్జీ ప్రకటించారు. అలాగే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సమాజంలో ఓ వర్గాన్ని కించపరిచేలా చేసిందని ఆమె విమర్శించారు. వివేక్ అగ్నిహోత్రి, ఆయన భార్య పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ లీగల్ నోటీసులు పంపినట్లు అగ్నిహోత్రి తెలిపారు. ఈ లీగల్ కాపీని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.