AP

తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్

తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరికలను తీర్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీపైన విమర్శలు చేయడం దారుణమన్నారు.

రేవంత్ రెడ్డిపైన తలసాని వ్యక్తిగత విమర్శలు ఆయన చేతగాని, చేవలేని తనానికి పరాకాష్ట అంటూ మల్లు రవి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి యువకుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలి.. చెప్పడానికి ఏమి లేని వాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారని మంత్రి తలసానిపై మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు.