Technology

వాట్సాప్ మనం మాట్లాడుకునేది సీక్రెట్ గా రికార్డు చేస్తోందా?

నిద్రిస్తున్న సమయంలో వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ట్విట్టర్ ఇంజనీర్ క్లెయిమ్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో వాట్సాప్‌ను నమ్మలేమని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగి తన వాదనలకు మద్దతుగా ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశాడు. మస్క్ ట్వీట్‌పై స్పందిస్తూ వాట్సాప్ ను విశ్వసించలేమని రాశారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో వాయిస్, వీడియో కాల్‌లతో సహా వాట్సాప్ లాంటి ఫీచర్లను తీసుకువస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.

ఫోడ్ డబిరి అనే ట్విట్టర్ ఇంజనీర్, ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. స్క్రీన్‌షాట్ లో WhatsApp అతని మైక్రోఫోన్‌ను ఉదయం 4:20 నుండి 6:53 వరకు యాక్సెస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. “WhatsApp has been using the microphone in the background, while I was asleep and since I woke up at 6AM (and that’s just a part of the timeline!) What’s going on?” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనతో వాట్సాప్ సోషల్ మీడియాలో మనం మాట్లాడుకునే దాన్ని రికార్డు చేస్తోందా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

 

Elon MuskWhatsAppWhatsApp featuresTwitter