CINEMA

మొదలైన రామ్ గోపాల్ వర్మ వ్యూహం.. వైఎస్ జగన్‌గా నటించేది ఎవరంటే..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం.
మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడం దాన్ని చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్. గత కొన్నేళ్లు రామ్ గోపాల్ వర్మ తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు రొటిన్ చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. తాజాగా ఈయన ‘వ్యూహం’ అంటూ రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. . అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’.. వ్యూహం అంటూ క్యాప్షన్ అంటూ చెప్పుకొచ్చారు.