CINEMA

మెక్ డొనాల్డ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా jr.ntr.. పారితోషికం?

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ అంతర్జాతీయస్థాయికి చేరింది. స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో జూనియర్ పలికించిన హావభావాలకు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్న సినీ ప్రముఖులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు.

ఈ సినిమా తర్వాత తారక్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేసుకుంటూ వస్తున్నాడు.

RRR సినిమాతో తారక్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. టాప్ బ్రాండ్ కంపెనీలన్నీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి పోటీపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాతో మెక్ డొనాల్డ్స్ చేరింది, ఫాస్ట్ ఫుడ్ కు ప్రపంచవ్యాప్తంగా పెట్టింది పేరైన ఈ సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. దీంతో జూనియర్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా ఉంది. ప్రస్తుతం ఈ యాడ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. #Dont Explain Just Share పేరుతో ఉన్న ఈ ప్రకటనలో ఎన్టీఆర్ నటన, స్టైల్ ఆకట్టుకున్నాయి.

ఈ యాడ్ చేసినందుకు రూ.6 నుంచి రూ.8 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను మెక్ డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా చేరడం సంతోషంగా ఉందని తారక్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది కస్టమర్లను కలిగివున్న సంస్థతో కలిసి ప్రయాణం చేయడం అద్భుతంగా ఉందన్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దేవర తర్వాత హిందీ వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్నారు. తన ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగా వరుసగా చేసుకుంటూ వస్తోన్న జూనియర్ త్వరలోనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తారనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.