CINEMA

‘ఎన్టీఆర్ 30’ కోసం హాలీవుడ్ టెక్నిషియన్..

ఒక సినిమాకి పని చేస్తున్న టెక్నీషియన్స్ ని బట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొంత సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అర్ధం చేసుకోగలరు. ఈ లెక్కన చూస్తే ఆచార్య సినిమాతో హ్యుజ్ నెగిటివిటి ఫేస్ చేసిన కొరటాల శివ, తన రిసర్రక్షన్ మోడ్ లో గాడ్ లెవల్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేంజులో ఎడిట్ చేసిన శ్రీకర్ ప్రసాద్, విక్రమ్ సినిమాకి పాన్ ఇండియా రీచ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఎన్నో సినిమాలకి ది బెస్ట్ సినిమాటోగ్రఫి ఇచ్చిన రత్నవేలు, రాజమౌళి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి ఆర్ట్ వర్క్ చేసే సాబు సిరిల్, ఫస్ట్ అండ్ ఫ్యురియస్ మరియు మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలకి స్టంట్ ఖొరియోగ్రఫి చేసిన కెన్నీ బేట్స్ ‘ఎన్టీఆర్ 30’కి వర్క్ చేస్తున్నారు. ఈ టెక్నిషియన్స్ లిస్టులో మరో హాలీవుడ్ టెక్నిషియన్ కూడా జాయిన్ అయ్యాడు.

 

జ్యాక్ సిండర్స్ జస్టిస్ లీగ్, డిస్నీ ఆక్వామాన్, బాట్ మాన్ Vs సూపర్ మాన్ సినిమాలకి ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చిన హాలీవుడ్ టెక్నిషియన్ ‘బ్రాడ్ మిన్నిచ్’ ఎన్టీఆర్ 30 క్రూలోకి జాయిన్ అయ్యాడు. దాదాపు 30 ఏళ్లుగా హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చిన బ్రాడ్ మిన్నిచ్, ఎన్టీఆర్ 30 సినిమాలోని సముద్ర బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్ ని రియలిస్టిక్ గా చూపించడానికి జాయిన్ అయినట్లు ఉన్నాడు. ఆక్వామాన్ సినిమా చూసిన వాళ్లకి బ్రాడ్ మిన్నిచ్ విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. గ్రాఫిక్స్ అండ్ రియల్ విజువల్స్ ని మెర్జ్ చేసి ఆడియన్స్ ది బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని రత్నవేలు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఈ లెక్కన చూస్తుంటే 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్-కొరటాల శివలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు. అందుకే సాలిడ్ టెక్నికల్ బ్యాకప్ తో ఎలాంటి పోటీ లేకుండానే బాక్సాఫీస బరిలో దిగడానికి ఎన్టీఆర్-కొరటాల శివ సిద్ధమవుతున్నారు.