National

బీజేపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం కొడుకు, రాజీనామాలు చేస్తామని !

ముంబాయి/న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన కూటమికి ముప్పు తప్పదని కొందరు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.

ఇందుకు నిదర్శనంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా తమ ప్రవర్తన మార్చుకోకుంటే మహారాష్ట్ర ప్రభుత్వంలో మేము రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికేశాడు, నాకు కూతురు లాంటిదని డ్రామాలు, హెచ్ఐవీ !

స్వార్థ రాజకీయాల కోసం డోంబివిలి ప్రాంతంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రవర్థిస్తున్నారని శ్రీకాంత్ షిండే మండిపడ్డారు. డోంబివిలి తూర్పు మండల అధ్యక్షుడు నందు జోషి, స్థానిక బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ విమర్శించారు. శ్రీకాంత్‌పై బీజేపీ నేతలు ఆరోపణలు చేయడంతో సీఎం కొడుకు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంల సీఎం ఏక్ నాథ్ షిండే శిబిరానికి లోక్ సభ ఎన్నికల్లో మద్దతివ్వబోమని స్థానిక బీజేపీ నేతలు బుధవారం తీర్మానం చేశారు.

లోక్‌సభ స్థానాల్లో ఏఖ్ నాథ్ షిండే వర్గానికి చెందినవారే పోటీ చేస్తారని ఆయన కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ ప్రకటించారు. దీంతో బీజేపీ, శివసేన మధ్య వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే మేము రాజీనామాలకు సిద్ధమయ్యామని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ షిండే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా విజయం సాధించారు. కల్యాణ-డోంబివిలి మహానగర ప్రాంతంలో భాగం.

 

కళ్యాణ్ నుండి రెండు సార్లు ఎంపీ అయిన శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే కుటుంబంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. పార్టీ యొక్క సంస్థాగత వ్యవహారాలు మరియు రాజకీయ నిర్వహణను నిర్వహిస్తూ పార్టీలో నంబర్ టూగా ఉన్నారు. 36 ఏళ్ల ఎంపీ ముంబాయి నగర సుందరీకరణ, ఇతర సమస్యలపై తన తండ్రి ఏక్ నాథ్ షిండే ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలగకుండా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి శ్రీకాంత్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి ఏక్ నాథ్ షిండే నిర్ణయాలను ఆయన కుమారుడు శ్రీకాంత్ నిశితంగా గమనిస్తూ ముందుకు వెలుతున్నాడు. న్యూఢిల్లీలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకి ప్రతినిధిగా ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే పని చేస్తున్నారు.