మిగిలిన భాషల కంటే హాలీవుడ్‌లో తెరకెక్కే అడ్వెంచరస్ మూవీలకే వరల్డ్ వైడ్‌గా ఆదరణ లభిస్తూ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్‌లో ఎన్నో రకాల సూపర్ హిట్ ఫ్రాంచైజీలు వచ్చాయి.
అందులో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఒకటి. ఇప్పటికే దీని నుంచి వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ‘మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ 1’ విడుదలైంది. టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు దక్కుతున్నాయి. దీంతో ఈ మూవీకి లాభాల పంట పడుతోంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!
టామ్ క్రూజ్ రేంజ్ మూవీనే:హాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన తాజా చిత్రమే ‘మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ 1’. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తీశారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.
ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో:అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ 1’ మూవీపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను అంటే.. భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు.
12వ రోజు ఇండియాలో ఇలా:టామ్ క్రూజ్ హీరోగా నటించిన ‘మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ 1′ మూవీకి ఇండియా వ్యాప్తంగా ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే, వర్కింగ్ డేస్‌లో మాత్రం తేలిపోయింది. కానీ, ఆదివారం మాత్రం ఈ చిత్రం మళ్లీ సత్తా చాటుకుంది. దీంతో ఈ చిత్రం 12వ రోజు ఇండియాలో రూ. 5.00 కోట్లు నెట్ కలెక్షన్లను వసూలు చేసుకుంది.
ఇండియాలో 9 రోజుల వసూళ్లు:’మిషన్ ఇంపాజిబుల్ 7’ ఇండియాలో తొలి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, 2వ రోజు రూ. 8.75 కోట్లు, 3వ రోజు రూ. 9.15 కోట్లు, 4వ రోజు రూ. 16 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35, 8వ రోజు రూ. 4 కోట్లు, 9వ రూ. 3.75 కోట్లు, 10వ రోజు రూ. 2.40 కోట్లు, 11వ రోజు రూ. 4.70 కోట్లు, 12వ రోజు రూ. 5 కోట్లతో మొత్తంగా రూ. 92.70 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.