మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకుంటుందా? అస్సలు వదులకోరు. కానీ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.
ఎందుకంటే.. వివరాళ్లోకి వెళ్లి తెలుసుకుందాం..
సినీ ఇండస్ట్రీ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఏమైనా జరగొచ్చు చెప్పలేం. ఓవర్ నైట్ స్టార్స్ గా ఎదగొచ్చు. అదే సమయంలో కెరీర్ లో డౌన్ స్టేజ్ లోకి వెళ్లిపోవచ్చు. ఒక్కోసారి మనకు దక్కాల్సిన అవకాశాలు చేజారిపోయి ఇంకొకరికి వెళ్లిపోతాయి. వేరే వాళ్లకు అందాల్సిన ఛాన్స్ లు మనకు వస్తుంటాయి. ఇవన్నీ చిత్ర సీమలో సర్వసాధారణం. ఇప్పుడు అనుష్క విషయంలో ఇలాంటిదే ఒకటి జరిగిందట.
బ్లాస్ బాస్టర్ మిస్.. :టాలీవుడ్ చిత్రసీమలో అనుష్క శెట్టికి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కథలను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి బోల్తా కొడుతుంటాయి కానీ.. నటన పరంగా ఆమె ఎప్పుడూ టాపే. అయితే ఓ సినిమా విషయంలో అనుష్క తీసుకున్న నిర్ణయం.. ఆమెకు ఓ భారీ బ్లాక్ బాస్టర్ ను రాకుండా చేసింది. ఫలితంగా ఆ ఛాన్స్ తో మరో హీరోయిన్ స్టార్ స్టేటస్ ను అందుకుని కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది.
ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. :’మగధీర’. రామ్ చరణ్ రెండో చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. ‘ఆర్ఆర్ఆర్’కు ముందు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకధీరుడు రాజమౌళి.. ముందుగా అనుష్క శెట్టిని అనుకున్నారట. ఆమెను సంప్రదించారట. కానీ అనుష్కకు కథ నచ్చినప్పటికీ ఓ చిన్న కారణంతో సినిమాను రిజెక్ట్ చేసిందట. అందుకు కారణం చరణ్ తనకన్నా తక్కువగా హైట్ ఉండటం ఓ కారణమని తెలిసింది. తెరపై ఇద్దరి జోడీ అక్కాతమ్ముళ్లలాగా ఉంటుందని భావించి.. అనుష్క ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.
అలా కాజల్ అగర్వాల్ కు.. :దీంతో జక్కన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారట. ఇక ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవ్వడం వల్ల.. ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 2009లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కాజల్ వరుస అవకాశాలను అందుకుని పెద్ద హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.