మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్..
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. త్వరలోనే హాలీవుడ్ మూవీలో కూడా నటించబోతున్నట్లు తెలిపాడు. అయితే రామ్ చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ తో ఆయనకు ఇష్టమైనది కొన్నారట. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తండ్రికి తగ్గ తనయుడు : మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా రామ్ చరణ్ తేజ్… చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి సినిమాతో ఇండస్ట్రీ చూపు అంతా తనవైపుకు తిప్పుకున్నాడు చరణ్. ఈ సినిమాలో చరణ్.. డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్ చూసి.. సినీ పెద్దలు ఫిదా అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కొనియాడారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక రెండో సినిమానే రాజమౌళితో చేశాడు చరణ్.
హాలీవుడ్ లోనూ : రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి రాజమౌళి కన్నుచరణ్ పై పడింది. ఇక రెండో సినిమా మగధీరతో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కొల్లగొట్టాడు చరణ్. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచి చరణ్ కు మంచి పేరును తీసుకువచ్చింది. స్టార్ హీరోను చేసింది. ఇక వరుసగా సినిమాలు చేస్తూ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు చరణ్. ఇక త్వరలో హాలీవుడ్ లోనూ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ రెమ్యూనరేషన్ తో : అయితే చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తన ఫస్ట్ సినిమా చిరుత సినిమాకు వచ్చిన రెమ్యూనరేషన్ తో చరణ్… తనకు ఇష్టమైనది కొనుక్కున్నారట. అదేమిటంటే… చరణ్ వాచెస్ అంటే మహా ఇష్టం అంట. తన దగ్గర డబ్బులు ఎంత ఉన్నా సరే వాచెస్ పైనే ఎక్కువగా ఖర్చు చేస్తారట. అయితే మొదటి రెమ్యూనరేషన్ తో కూడా తనకు ఇష్టమైన వాచ్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.
వాచెస్ అంటే మక్కువ : చరణ్ ఎక్కడికి వెళ్లినా వాచ్ మాత్రం తప్పకుండా కొంటాడట. అయితే చరణ్ తన ఫేవరేట్ వాచ్ ఏంటంటే… పటేక్ అంట. ఈ వాచ్ ను కరోనా టైంలో చరణ్ కొనుక్కోగా.. అది ఇంటికి పార్సెల్ వచ్చినప్పుడు చరణ్ చాలా సంతోషించాడని సమాచారం. మిలిటరీ కలర్ లో ఉన్న ఆ వాచ్ తనకి ఎంతో ఇష్టమని తెలుస్తోంది. ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నెక్ట్స్ మూవీస్ : ఇదిలా ఉంటే చరణ్ ప్రస్తుతం.. గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో తన 16 వ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.