CINEMA

సూపర్​ హిట్ లవ్​ స్టోరీ డైరెక్టర్​తో.. మళ్లీ ప్రభాస్​ -అనుష్క సినిమా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… ప్రస్తుతం వరుస సినిమాలతో బిజి బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో వచ్చాడు. ఇప్పుడు సలార్, ప్రాజెక్టు కె సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మారుతి సినిమా అని వార్తలు వచ్చినప్పటికీ అది ఉంటుందో లేదో క్లారిటీ లేదు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా ఉంటుందని అన్నారు. ఇక సందీప్ తో సినిమా కంటే ముందు ఓ సినిమా చేయనున్నారట. ఆ మూవీకి సంబంధించిన అప్టేట్స్ బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే…

వరుస సినిమాలు : ప్రభాస్… బహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయనకు ఆ రెంజ్ సక్సెస్ లేకపోయినా.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సాహో, రాదేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు చేశాడు. ఇక ఆ మూడు సినిమాలు.. బహుబలి స్థాయిని అందుకోలేక పోయాయి. మొన్నటి ఆదిపురుష్ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకోగా… అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ నెక్ట్స్ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

 

ఆ రెండు సినిమాలపై : ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. టీజర్ లో ప్రభాస్ కనిపించకపోయినా.. సినిమాపై అంచనాలు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కె తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదలగా… దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాలో బిగ్ స్టార్స్ నటించబోతున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చాన్, దీపిక పదుకుణె, దిశా పటానీ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

 

మారుతితో ఉంటుందో లేదో : అయితే ప్రభాస్ ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామెడీ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు సినిమా ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇదిలా ఉంటే.. సందీప్ వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే సందీప్ వంగా ప్రస్తుతం ఫుల్ బిజిగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్ లోనే ఓ సినిమా చేయాలని ప్రభాస్ భావించారట. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటించనుందని సమాచారం.

 

లవ్ స్టోరీ సినిమాలో : ప్రభాస్ అనుష్క జంటకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరు పెళ్లి చేసుకుంటే చూడాలనుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈ జంట మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయనుందట. అయితే ఈ సినిమా పూర్తి లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట. గత ఏడాది సీతారామం అనే ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు అని సమాచారం. సీతారామం లాగానే ఈ సినిమా ఫుల్ క్లాసిక్ లవ్ స్టోరీగా ఉండబోతుందట.