తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి రీతూ చౌదరి.. ఈమె పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన జబర్దస్త్ ద్వారానే తన క్రేజీను బాగా సంపాదించింది.
గడిచిన కొన్ని రోజుల క్రితం రీతూ చౌదరి ,శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ త్వరలో మేము వివాహం చేసుకోబోతున్నాం అంటూ కూడా తెలియజేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అతను కూడా హైదరాబాదుకు చెందిన ఒక పొలిటిషన్ కుటుంబానికి చెందిన అబ్బాయి.
అంతేకాకుండా తను ఒక బిజినెస్ మాన్ అన్నట్లుగా అప్పుడు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇటీవల కొన్ని రోజుల క్రితం రీతూ తండ్రి మరణించిన సంగతి తెలిసిందే అప్పటినుంచి తను బాధలో ఉన్న ఇప్పుడిప్పుడే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తోంది తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది.. రీతూ చౌదరి నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడం జరిగింది.
లవ్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలను తెలియజేయడం జరిగింది.. రీతూ చౌదరి పెళ్లి చేసుకోవద్దు హ్యాపీగా ఉండండి అమ్మో పెళ్లా? ఎవరిని లవ్ చేయట్లేదు నాతో నేను లవ్ లో ఉన్నాను అంటూ ఇలా అన్నీ కూడా ప్రేమ పెళ్లి గురించి సమాధానాలను తెలియజేసింది రీతూ చౌదరి..శ్రీకాంత్ తో మాట్లాడుతున్నారని మరొక నేటిజన్ అడగగా సారీ త్వరలోనే చెప్పేస్తానంటూ తెలిపింది.. దీంతో రీతూ చౌదరి శ్రీకాంత్తో పెళ్లి చేసుకోవట్లేదు అంటూ పలువురు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరు విడిపోయారా లేదా అన్న విషయం పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.