హైదరాబాద్: దక్షిణాదిన డెస్టినేషన్ సిటీగా ఆవిర్భవిస్తోన్న హైదరాబాద్‌లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.
త్వరలోనే ఇది సందర్శకులకు అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక కేంద్రాలకు కేంద్రబిందువైన భాగ్యనగరానికి అదనపు అందాన్ని తెచ్చి పెట్టేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం.
దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ అక్వేరియం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. పక్షుల ఆవాస కేంద్రంగా కూడా ఇది ఆవిర్భవించనుంది. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం, పక్షుల ఆవాస కేంద్రంగా ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది.
దేశంలోని పలు నగరాల్లో అండర్ టన్నెల్ అక్వేరియాలు ఉన్నాయి. బెంగళూరులో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం సందర్శకులకు అందుబాటులో ఉంది. అలాంటిదే హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు కానుంది. కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌కు ఇదివరకే శంకుస్థాపన చేశారు కేటీఆర్. ఉస్మాన్ సాగర్‌లో ల్యాండ్ స్కేప్ ఎకో పార్కును కూడా సందర్శకుల కోసం ప్రారంభించారు.
ఇది- ఇప్పుడు తాజాగా వివాదాస్పదమౌతోంది. ఆక్వా మెరైన్ పార్క్‌ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఓ మినీ ఉద్యమాన్ని చేపట్టారు. ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృత్రిమ సరస్సును సృష్టించడం పర్యావరణానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
మహిళా నటులు శ్రీదివ్య, సదా, దర్శకుడు శశికిరణ్ తిక్కాతో పాటు పలువురు సెలబ్రెటీలు రేణు దేశాయ్‌కు మద్దతుగా నిలిచారు. ఇవ్వాళ ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. అనేక దేశాల్లో ఇలాంటి అక్వా పార్కులు, అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయని, తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించింది. వాదనలను విన్న అనంతరం విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.