CINEMA

పవర్ స్టార్ సినిమాకు నో చెప్పి బాధపడుతున్న బుట్టబొమ్మ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో `భవదీయుడు భగత్‌సింగ్‌` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక అయింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కావాల్సి ఉన్న ఈ చిత్రం `హరి హర వీరమల్లు` అనంతరం సెట్స్‌ మీదకు వెళుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇటీవల ఈ మూవీ టైటిల్ ను `ఉస్తాద్ భగత్ సింగ్`(ustaad bhagat singh) గా మార్చి కొత్త పోస్టర్ ను వదిలారు. `మనల్ని ఎవడ్రా ఆపేది` అనే ట్యాగ్ లైన్ ని కూడా తగిలించారు.

ఆదివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. అయితే ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగోతంది. పవన్ తో సినిమా చేయాలనే ఆశ ఉన్నప్పటికీ.. పూజా తన ఆశను చంపుకుని `ఉస్తాద్ భగత్ సింగ్`లో నటించలేనని హరీష్ కు చెప్పిందట. పైగా పవన్ సినిమాను వదులుకున్నందకు పూజా హెగ్డే(pooja hegde)ఎంతగానో బాధపడుతుందట. అయితే పవన్ సినిమాకు పూజా నో చెప్పడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటు రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు.

అనుకున్న సమయానికి ఏ సినిమాను పూర్తి చేయలేకపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్(pawan) తో సినిమా అంటే అతని సమయానుకూలంగానే షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. పవన్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రెడీగా ఉండాలి. పవన్ కోసం సినిమా చేయడానికి ఒప్పుకుంటే చాలా డేట్స్ ఫ్లాష్ అవుతాయి. ఈ కారణంగా `ఉస్తాద్ భగత్ సింగ్`లో నటించలేనని సున్నితంగా పూజా హెగ్డే పక్కకు తప్పుకుందట. పవన్ కోసం ఇతర హీరోలను ఇబ్బంది పెట్టడం కంటే.. ఈ సినిమానే వదులుకోవడం మంచదని ఆమె భావించిందని టాక్ నడుస్తోంది.