మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ ఉంటుంది . దేవుడు ఉన్నచోట దెయ్యం కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు . ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడ చీటింగ్ కూడా ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు చీట్ చేయకపోతే మనం పైకి రాలేం ..అది అందరికీ తెలిసిందే ..ఆ చీటింగ్ లో కూడా నిజాయితీ ఉండాలి. అలాంటి నిజాయితీ చీటింగ్ చేసి మరి మెగాస్టార్ గా మారాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడి పైకి ఎదిగాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కరి సపోర్ట్ లేకుండా చిన్న హీరో నుంచి మెగాస్టార్ గా మారి మెగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు . అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరియర్లు స్టార్టింగ్ లో తప్పులు చేశాడు . వెరే హీరో కోసం రాసుకున్న కథలో నటించి మెగాస్టార్ చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు .
అఫ్ కోర్స్ ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం … అయితే చిరంజీవి అలా నటించడం వల్లనే మెగాస్టార్ గా మారారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలో తెలియదు . అందుకే పక్క వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సినిమాలు చూస్ చేసుకుంటున్నారా అంటూ తన బాడీకి తగ్గిన రేంజ్ లో కథలను చూస్ చేసుకునే వారట . ఈ క్రమంలోనే కొందరు హీరోస్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవాలని ఆ సినిమాని హోల్డ్ లో పెడితే .. ఆ సినిమాలను తక్కువ డబ్బులకే యాక్సెప్ట్ చేసి చిరంజీవి ఆ సినిమాలో నటించి హిట్టు అందుకున్నాడు. ఇక డైరెక్టర్ లు అందరూ కూడా చిరంజీవి తక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు.. పైగా బాగా నటిస్తున్నాడు అని సదరు హీరోల సినిమాలన్నీ తీసుకొచ్చి చిరంజీవి ఖాతాలో వేసేసారు. దీంతో చిరంజీవికి వరుస హిట్స్ పడడమే కాకుండా మెగాస్టార్ గా మారిపోయాడు. తెలిసో తెలియకో చిరంజీవి కూడా అలా పక్క హీరోల సినిమాల ద్వారానే హిట్స్ అందుకొని మెగాస్టార్ అయ్యాడు..!!