ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు గంట వ్యవధిలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.
దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం రూ.1.7 కోట్ల విలువైన తన పోర్షే కారులో జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. హోటల్ ముందు కారు ఆపి లోపలికి వెళ్లారు. 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి కారు బయట కనిపించలేదు. దీంతో అర్చిత్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. తాను ప్రముఖ వ్యాపారవేత్త ఆకాష్ అంబానీ పి.ఎ అంటూ పోలీసులకు దబాయించాడు. హృతిక్ రోహన్ నా పీఏ అంటూ రుబాబుగా మాట్లాడాడు. ఒక్క మంత్రి పిక్ అప్ కొరకు కారు తీసుకొని పోతునాన్ని పోలీసులకే దబాయించి మట్లాడాడు. అతని వదిలేస్తే అంబానీ దగ్గరకు వెళ్తానని పోలీసులను బెదిరించాడు. అతని మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నారు. కారును దొంగిలించిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స అందించారని తేలింది. నిందితుడిని హైదరాబాద్ మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. అనంతరం అర్చిత్ రెడ్డికి కారు అప్పగించారు.