CINEMA

స్నేహానికి సాహో అంటూ మాస్ యాక్షన్ తో దంచి కొడుతున్న సలార్..

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ సలార్. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వరుసగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఇప్పటివరకు చప్పుడు చేయకుండా ఉన్న చిత్ర బృందం ఫైనల్ గా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసింది. కేజిఎఫ్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.

 

ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈరోజు ఈ చిత్రం నుంచి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ,హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల అయింది. ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఫ్రెండ్షిప్.. రాజకీయం.. కుళ్ళు.. కుతంత్రాలతో ఈ ట్రైలర్ ని పూర్తిగా నింపేశారు అనిపిస్తుంది.

 

మన సమాజంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలను మూవీకి తగినట్టుగా ప్రశాంత్ ని ఈ ట్రైలర్ లో పొంది పరిచాడు. ఈ భారీ యాక్షన్ ట్రైలర్.. మంచి గ్రిప్పింగ్ సన్నివేశాలతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఒకపక్క ప్రభాస్ పృథ్వీరాజ్ మధ్య స్నేహాన్ని ఎలివేట్ చేస్తూ.. మంచి రిచ్ విజువల్స్ కూడా ఇచ్చారు. నీకోసం ఎరైనా అవుతా.. సోరైనా అవుతా.. అనే డైలాగ్ తో స్టార్ట్ అయ్యే ట్రైలర్ హీరోకి అతని ఫ్రెండ్ పై ఎంత ఎఫ్ఫెక్షన్ ఉందో క్లియర్ గా చెబుతుంది.

 

కేజిఎఫ్ లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కాన్సారా అనే ఒక బందిపోటుల సామ్రాజ్యాన్ని చూపించారు. ఇక పదవుల కోసం జరిగే కుతంత్రాలు.. కుళ్ళు రాజకీయాలు బాగా ఎలివేట్ చేశారు. రాజా మన్నార్ తన కొడుకును.. తన గద్దెకు వారసుడిగా చేయాలి అనుకుంటాడు. అయితే అతను లేని సమయంలో కొడుకు పై దాడి జరుగుతుంది. తనకు ఎదురుగా వస్తున్న వందల సైన్యానికి అడ్డుగా ఎవరిని తెచ్చుకుంటావు అని అడిగినప్పుడు.. వరద చెప్పే ఒకే ఒక పేరు దేవా.. అది ప్రభాస్ అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది.

 

ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్ లో చూపించారు. పెద్ద పెద్ద గోడలు కట్టేది భయంతో.. బయటకు ఎవరో పోతారని కాదు.. లోపలికి ఎవరు వస్తారని.. లాంటి డైలాగ్స్ ప్రభాస్ చెబుతుంటే వినడానికి ఎంతో మస్త్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా సెట్ అయింది.హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్.. రాబోయే చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రభాస్ గెటప్ కూడా ఈ మూవీలో సూపర్ గా ఉంది. ఇక డార్లింగ్ ఫాన్స్ మంచి మాస్ మోడ్లో ప్రభాస్ ని చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు.