సలార్, డంకీ సినిమాలకు కాటేరా అనే ప్రాంతీయ సినిమా ఇచ్చిన షాక్ కు ప్రభాస్ ఫ్యాన్స్, కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకప్పుడు కన్నడ సినిమాలు ఇతర బాషా చిత్రాలకు భయపడి విడుదల చెయ్యడానికే భయపడేవారు.
అయితే ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. కన్నడ సినిమాలకు బాలీవుడ్ తో సహా వివిధ భాషల సినిమాలు విడుదల చెయ్యడానికి వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు.
ఈ విషయాన్ని కన్నడిగులు నిర్మించి ఇటీవల విడుదల చేసిన ప్రాంతీయ చిత్రం కాటేర మరోసారి రుజువు చేసింది. స్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటించిన సినిమా కాటేర విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందే సలార్, డంకీ సినిమాలు విడుదలయ్యాయి. కాబట్టి కటేరా సినిమాకు తీవ్రంగా పోటీ ఉండేది. ఈ ఛాలెంజ్ స్టార్ నటించిన కాటేర చిత్ర బృందం ఛాలెంజ్‌గా స్వీకరించి ఆ సినిమాను విడుదల చేసింది.
సలార్, డంకీ పెద్ద సినిమాలు అయినప్పటికీ దాని సరసన కన్నడ చిత్రం కాటేరా విడుదలైంది. ఇప్పుడు ఈ మూడు సినిమాల ఫైట్ లో ఎవరు గెలిచారో తెలుసా? అని కన్నడిగులు అంటున్నారు. డంకీ సినిమా విడుదలై నేటికి చాలా రోజులు అయ్యింది. డంకీ సినిమా డిసెంబర్ 21న విడుదలైంది. రోజురోజుకు బాక్సాఫీస్ కలెక్షన్స్ పెరుగుతున్న డంకీ సినిమా ఇప్పుడు రూ. 410 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా ఇండియాలో ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. ఇంతకీ సలార్ సినిమా ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్లు రాబట్టింది అంటే చాలా మంది చాలా లెక్కలు చెబుతున్నారు. సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసిందని లెక్కలు చెబుతున్నారు. సినిమా విడుదల అయి చాలా రోజులు అవుతున్నా సలార్ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి.
తొలిరోజు రూ.175 కోట్లు రాబట్టిన సలార్ తర్వాతి రోజుల్లో సూపర్ హిట్ అయ్యి కలెక్షల వర్షం కురిపిస్తోంది. దీంతో వరుస పరాజయాలతో షాక్‌లో ఉన్న డార్లింగ్ ప్రభాస్‌కు సలార్ బిగ్ బ్రేక్ ఇచ్చింది. సౌత్ ఇండియన్ సినిమా సలార్ తన ఖ్యాతిని మరింతగా పెంచుకుంది. అయితే విడుదల అయిన 5 రోజులు తరువాత కూడా కన్నడ సినిమా కాటేరా దూసుకుపోతోంది. గత 5 రోజుల్లో కాటేరా సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.