CINEMA

నవంబర్లో #SSMB28 షూటింగ్ మొదలయ్యే ఛాన్సు

దసరా హాలిడేస్‌కు ఇంటికెళ్ళిన సూపర్‌స్టార్ మహేష్‌ ఆ తరువాత తన తల్లి చనిపోవడంతో షూటింగ్‌కు దూరమయ్యామడు. కాని నెల తరువాత కూడా ఇప్పుడు #SSMB28 షూటింగ్ మొదలుపెట్టడానికి కుదరట్లేదు.

స్ర్కిప్ట్ సెట్టవ్వలేదని, యాక్టర్లు దొరకలేదని.. ఎన్ని న్యూస్‌లు వినబడుతున్నా కూడా, రీజన్ ఏంటో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ టీమ్ కూడా బయటకు చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మాత్రం సాలిడ్‌గా ప్రొడక్షన్ సభ్యుల నుండి ఒక మాట వినిపిస్తోంది.

నవంబర్ నెలలో కూడా #SSMB28 మొదలయ్యే ఛాన్సులేదని తెలుస్తోంది. ఒక ప్రక్కన ఇతర తారాగణం తాలూకు డేట్స్ లేకపోవడంతో ఒక ప్రాబ్లమ్ అయితే, మరో ప్రక్కన డస్కీ బ్యూటి పూజా హెగ్డే కూడా లిగమెంట్ బ్రేక్ అవ్వడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. దానితో ఏ విధంగానూ మహేష్‌ బాబు సినిమాను త్రివిక్రమ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళలేకపోతున్నాడట. ఏదేమైనా కూడా డిసెంబర్ మొదటి వారం తరువాతనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. పైగా మ్యూజిక్ కు సంబంధించిన పనులు కూడా పూర్తవ్వలేదట. థమన్ ఆల్రెడీ కొన్ని బాణీలు ఇచ్చేశాడు కాని, అవి మహేష్‌కు నచ్చకపోవడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలో నిమగ్నమయ్యాడట.

మొన్నటివరకైతే రాజమౌళి సినిమాను వెంటనే స్టార్ట్ చెయ్యాలి కాబట్టి మహేష్‌ తొందరపడుతున్నాడని అనుకున్నారు. కాని రాజమౌళి సినిమాను 2024 వరకు సెట్స్ తీసుకెళ్లే ఛాన్స్ లేదని క్లారిటీ రావడంతో, సూపర్‌స్టార్ కూడా కాస్త స్లోగానే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడని అనుకోవచ్చేమో.