CINEMA

విల్లా కోసం కక్కుర్తి పడి నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు

టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని హీరోల్లో రాజ్ తరుణ్(Raj tarun) ఒకడు. `ఉయ్యాల జంపాల` చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన రాజ్‌ తరుణ్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ వెంటనే సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో వరుసగా మరో రెండు హిట్లను అందుకున్న రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఓకే తరహా కథలను ఎంపిక చేసుకోవడంతో.. రాజ్ తరుణ్ కెరీర్ పతనం వైపు మళ్లింది. బ్యాక్ టు బ్యాక్‌ చిత్రాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. కెరీర్ ఆరంభంలో పడ్డ మూడు హిట్ల తర్వాత రాజ్ తరుణ్.. డజనుకు పైగా ఫ్లాపులను చవిచూశాడు. ఇక లాభం లేదనుకున్న ఈ యంగ్ హీరో.. ఇటీవల `ఆహా నా పెళ్ళంట`(ahana pelli anta) అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వెబ్ సిరీస్ ఇచ్చిన సక్సెస్ తో రాజ్ తరుణ్ లో కాస్త ఉత్సాహం పెరిగింది. ఈ సంగతి పక్కన పెడితే.. రాజ్‌ తరుణ్ కెరీర్‌ లో ఓ రిమార్క్ ఉంది.

విల్లా కోసం కక్కుర్తి పడి నిర్మాత అనిల్ సుంకర(producer anil sunkara) బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేశాడని, ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆయన కెరీర్ నాశనం అయ్యిందని గతంలో రాజ్ తరుణ్ పై ట్రోల్స్ జరిగాయి. అయితే రీసెంట్గా ఈ టోట్స్ పై రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. విల్లా కోసం కక్కుర్తి పడి మూడు సినిమాలు చేయలేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు. `విల్లా ఇస్తారని ఆశపడి మూడు సినిమాలు చేయలేదు. అనీల్ సుంకర నాకు విల్లా ఆఫర్ ఇవ్వలేదు. ఆయనతో ముందు ఒక సినిమానే అనుకున్నాం. కొందరు రెమ్యునరేషన్ కూడా నాకు ఇచ్చారు. ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు.. మరో 2 కథలొచ్చాయి. అవి కూడా తనే చేస్తానన్నారు అనీల్ సుంకర. అయితే ఒకేసారి ఎక్కువ డబ్బు వస్తే నేను ఖర్చుపెట్టేస్తానని, అనీల్ సుంకరతో నాకు విల్లా ఇప్పించాడు రాజారవీంద్ర. విల్లా కోసం ఆ 3 సినిమాలు చేయలేదు. ఆ సినిమాలు చేసే క్రమంలో విల్లా వచ్చింది.` అని రాజ్ తరుణ్(Raj tarun) స్పష్టం చేశాడు. అయితే ఈ మూడు సినిమాలు చేసే క్రమంలో రాజ్ తరుణ్ `శతమానంభవతి`(Sathamanam Bhavati) వంటి బ్లాక్ బస్టర్ మూవీని వదులుకోవడం గమనార్హం.