CINEMA

వల్తేరు వీరయ్యకు దాదాపుగా రూ. 6.5 కోట్లు …మాస్ మహారాజా రవితేజ

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో మత్స్య కారుల నాయకుడు వీరయ్యగా చిరంజీవి కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలెన్స్ ఉండడంతో వాటిని యూరోప్ లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్న రవితేజ(ravi teja) ఫస్ట్ లుక్ టీజర్ ను బయటకు వదిలారు. ఈ టీజర్ కు విశేష ఆదరణ లభించింది.

యాక్షన్ సీక్వెన్స్ తో మలిచిన ఈ ఫస్ట్ లుక్ టీజర్ రవితేజ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. `ఫస్ట్ టైం ఒక మేక పిల్లను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నాది` అంటూ రవితేజ క్యారెక్టర్ ను అద్భుతంగా ఎలివేట్ చేశారు. మొత్తానికి ఈ టీజర్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమాపై మరిన్ని అంచనాలను సైతం క్రియేట్ చేసింది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు `వాల్తేరు వీరయ్య`(waltair veerayya)కు రవితేజ అందుకుంటున్న పారితోషికం నెట్టింట హాట్‌ టాపిక్ గా మారింది. ఇప్పటికే రవితేజ షూటింగ్ పార్ట్‌ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది.

ఆయనకు స్క్రీన్ టైం కూడా ఎక్కువే కేటాయించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ ఈ సినిమాకు గట్టిగానే లాగుతున్నాడట. ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే రవితేజ(ravi teja).. వల్తేరు వీరయ్యకు దాదాపుగా రూ. 6.5 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. నిర్మాతలు సైతం రవితేజ పాత్రకు కాస్త వెయిట్ ఎక్కువగానే ఉండడంతో అంత మొత్తం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.