షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న పటాన్ చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. జనవరి 25న విడుదల కావాల్సిన పటాన్ చిత్రం లోని ‘బేషరమ్ రంగ్’ అనే పాట ప్రస్తుతం భారీ రేంజ్ లో వివాదాన్ని సృష్టించింది. విడుదలైనప్పటి నుంచి విపరీతంగా ట్రెండింగ్ అవుతూనే చర్చనీయాంశంగా మారింది ఈ పాట. ఈ పాటలో దీపికా కాస్ట్యూమ్ పైన ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పటాన్ సినిమాను కూడా బ్యాన్ చేయాలి అని సోషల్ మీడియాలో డిమాండ్ జోరుగా సాగుతోంది.
స్వయంగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీని గురించి తన ట్వీట్లో వివరణ ఇచ్చారు. అంటే నిరసన ఏ రేంజ్ లో ఉందో ఆలోచించండి. ఈ పాటలు కుంకుమ పువ్వు వర్ణపు దుస్తులను వాడడంపై నరోత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల ధర్మం ప్రకారం కుంకుమపువ్వు రంగుని దైవత్వంగా అలాంటి రంగును ఈ పాటలో చూపించడం సబబు కాదు అని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. ఈ చిత్రాన్ని నిషేధించాలి అని ఆయన డిమాండ్ కూడా చేశారు. ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నందున వెంటనే వాటిని మార్చకపోతే మొత్తం మధ్యప్రదేశ్లో ఈ పటాన్ చిత్రాన్ని నిషేధిస్తామని ఆయన సోషల్ మీడియాలో హెచ్చరించారు.
వివాదం విషయం పక్కన పెడితే ‘బేషరమ్ రంగ్’ సాంగ్ దీపికా అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పవచ్చు. ఈ సాంగ్ ను విశాల్ – శేఖర్ ,షారుఖ్ ఖాన్ మరియు దీపిక పదుకొణె మీద కంపోజ్ చేశారు. ఇందులో దీపిక షారుక్ ల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంది. అయినప్పటికీ హాష్ టాగ్ బాయ్కాట్ పటాన్ అంటూ సోషల్ మీడియాలో ఈ మూవీ ని బాయ్కాట్ చేయాలి అని చాలామంది డిమాండ్ చేయడం తో ప్రస్తుతం కొత్త వివాదానికి దారితీసింది. మరి ఈ వివాదం చిత్రంపై భారీగా పడుతుందా లేక షారుక్ వివాదం నుంచి బయటపడతాడా అనేది తెలియాలంటే వేచి చూడాలి.