National

ఐబొమ్మ వాడుతున్న వారికి షాక్.. మీరు వాడుతుంటే చెక్

ప్రస్తుతం సినిమా ధియేటర్ లతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా విరివిగా పెరిగిపోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 లాంటి నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండగా ఆహా వంటి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకులను అల్లరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ లో వచ్చే కంటెంట్ ని ఐ-బొమ్మ అనే ఒక వెబ్సైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కొంత మంది వాస్తవానికి ఇది పైరసీ అయిన చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ వెబ్సైట్స్ ని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు.

ఒకానొక సమయంలో ఈ వెబ్సైట్ మూసి వేస్తామని అంటే అవసరమైతే నెలకింతని కడతాం సబ్స్క్రిప్షన్ లాంటి అవకాశాలు తీసుకురావాలని కూడా సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే తర్వాత తమకు ఇబ్బందికరంగా ఉందని సైట్ మూసేస్తున్నామని ప్రకటించిన నిర్వాహకులు మళ్లీ మనసు మార్చుకుని నడుపుతామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా నిర్వాహకులు మరోసారి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ ఇండియాలో ఓపెన్ కావడం లేదు. సినీ ప్రేక్షకులను అలరించే ఐ బొమ్మ వెబ్సైట్ మళ్లీ ఆగిపోయింది, ప్రస్తుతం వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన దేశంలో సేవలు నిలిచిపోయినట్లు ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది.

అయితే పలు కారణాలతో మూసివేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించిన ఐ బొమ్మ ఆ వెంటనే కొద్ది రోజులకే మళ్లీ తిరిగి అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఐ బొమ్మ వెబ్సైట్ లో ఇలాంటి వీడియోస్ చూడడం నేరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఎంతో కష్టపడి కంటెంట్ నీకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు ధర ఫిక్స్ చేసి వారి ముందుకు తీసుకు వస్తుంది. కానీ ఇలా పైరసీ చేయడం వల్ల వాటికి నష్టం చేకూరుతుందని అంటున్నారు.

ఈ సినిమాలను థియేటర్లలో షూట్ చేసి రిలీజ్ చేయడం ఎంత తప్పో ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి అనధికారికంగా డౌన్లోడ్ చేసి ఒక వెబ్సైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా అంతే తప్పు అని చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు ఏమైనా ఈ విషయంలో చర్యలు తీసుకున్నారో లేక ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఐ బొమ్మ మాత్రం అందుబాటులో లేదు. ఇక మీకు ఐబొమ్మ ఓపెన్ అవుతుందా? లేదా? కింద కామెంట్ చేయండి.