ఢాకా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
ఓపెనర్ జేసన్ రాయ్(124 బంతుల్లో 132, 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బట్లర్ 76 పరుగులతో రాణించాడు. చివర్లో మొయిన్ అలీ 42 నాటౌట్, సామ్ కరన్(19 బంతుల్లో 33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు, షకీబ్ , తైజుల్ ఇస్లామ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు.
ఈ విజయం ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. సెంచరీతో చెలరేగిన జేసన్ రాయ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.