National

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?

చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు, అరటి పండ్లు, ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు.

అయితే ఏ పండ్లు పెడితే ఎటువంటి ఫలితం వస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

vastu tips: అప్పుల బాధలు మీకు తగ్గాలా? అయితే ఈ పరిహారాలు చేసి చూడండి!!

చాలామంది సహజంగా భగవంతుడికి నైవేద్యంగా పూర్ణ ఫలమైన కొబ్బరికాయను సమర్పిస్తారు. భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల మొదలు పెట్టిన అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని చెబుతారు. చాలామంది భగవంతుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అరటి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు.

అంతేకాదు అరటి పండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని, చేజారి పోయిన సొమ్ము సకాలంలో తిరిగి మళ్ళీ లభిస్తుందని చెబుతారు. అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తవుతాయని చెబుతారు.భగవంతుడికి ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే దారిద్రం తొలగి పోయి ధనవంతులు అవుతారని చెబుతారు.

కమలా పండుని భగవంతునికి నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయని చెబుతారు. సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారి వివాహ అవాంతరాలు తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసినటువంటి నగదు ఎటువంటి అవాంతరాలు లేకుండా తిరిగి మనకు చేరుతుందని చెబుతారు.

పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం అవుతుందని, రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు. ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్న పిల్లలకు, పెద్దలకు పంచితే ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారని, రోగాలు నశించి, పనులు సకాలంలో పూర్తవుతాయని చెబుతారు.

 

శనీశ్వరుడుకి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అంజీర పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి, మీరు తర్వాత తింటే అనారోగ్య బాధలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు.

disclaimer: ఈ కథనం హిందూ ధర్మ శాస్త్రాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.