National

అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం.

అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం.
ఈ రోజు 10 వ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అల్లాదుర్గం మాజీ ZPTC కె. మమత బ్రహ్మం అల్లాదుర్గం మండలంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవ సూచకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి అన్ని విధాల అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు వారి కుటుంబాలను సైతం పక్కన పెట్టి, పోలీస్ కేసులు అయినా తెగించి పోరాటం చేసిన కూడా వారికి ప్రస్తుతం గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులు ఐక్యంగా ఏక తాటిపైకి రావాలని, అన్ని పార్టీలు వారి మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పింఛన్ పథకం, వారి కుటుంబంలో ఉద్యోగాలు కల్పన పథకాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారు ZPTC కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు మోహన్ రాథోడ్, కాల రాములు, కే బ్రహ్మం, గోపాల్,.తులసీదాస్, నక్క దుర్గయ్య ,మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.