గత రెండు నెలల్లో తెలంగాణ పోలీసులు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) సమన్వయంతో దొంగలు దొంగిలించ మొత్తం 2219 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏప్రిల్ 19, 2023 నుంచి మొబైల్ దొంగతనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ని ఉపయోగించి పోయిన సెల్ ఫోన్లు పట్టుకుని బాధితులకు అందించారు.
మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న లేదా దొంగలించబడినా బాధితులు ఫిర్యాదుల నమోదు కోసం తెలంగాణ పోలీసులు DoT సహకారంతో CEIRని ప్రవేశపెట్టారు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, అధికారులు మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసి గాడ్జెట్ ఉన్న వ్యక్తికి అందుబాటులో లేకుండా చేస్తారు. ఏప్రిల్ 18, జూన్ 20 మధ్య రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ చేసిన మొబైల్ ఫోన్‌లకు సంబంధించి CEIR పోర్టల్‌కు 34200 ఫిర్యాదులు అందాయి.
ఇందులో 5970 మొబైల్‌లను గుర్తించారు. 17.46 శాతం ట్రేస్‌బిలిటీగా నమోదు అయింది. స్వాధీనం చేసుకున్న ఫోన్లను అన్‌బ్లాక్ చేసి బాధితులకు అప్పగించారు. మొబైల్స్ ట్రేసింగ్‌లో అన్ని పోలీసు విభాగాలు సహకరించినప్పటికీ, సైబరాబాద్ పోలీసులు 300 మొబైళ్లు, వరంగల్ పోలీసులు 175 మొబైళ్లు, రాచకొండలో 148, కామారెడ్డి పోలీసులు 131 మొబైల్ ఫోన్లు పట్టుకున్నారు. ఏప్రిల్ 13 న, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అంజనీ కుమార్ 60 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా సమావేశాన్ని ప్రారంభించారు.
780 పోలీస్ స్టేషన్లకు CEIR యూజర్ ఐడిలను పంపిణీ చేశారు. అదనపు DGP మహేష్ M భగవత్, CEIR పోర్టల్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. CEIR అధికారికంగా ఏప్రిల్ 19న ప్రారంభించారు. దీని తర్వాత CEIR రోజువారీ పురోగతి ఫలితంగా మొదటి నెలలో 1000 కంటే ఎక్కువ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మరో 1160 మొబైల్‌లు స్వల్ప వ్యవధిలో స్వాధీనం చేసుకున్నారు. 25 రోజుల వ్యవధి (మే 23 నుండి జూన్ 18 వరకు) ఇన్ని ఫోన్లు పట్టుకున్నారు.