National

మాట్లాడాలని ఆటో కుర్చోపెట్టిన ప్రియుడు?

ముంబాయి/మహారాష్ట్ర: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగేశారు.

పెళ్లికి ముందే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. అయితే పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నో చెప్పారు. ప్రియురాలు ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ఆటో డ్రైవర్ ను బయటకు పంపించి అదే ఆటోలో మాట్లాడుతున్న ప్రియురాలిని ఆమె ప్రియుడు గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

మహారాష్ట్రలోని ముంబాయిలోని సకినాగా ప్రాంతంలో పంచశీల సమధార్ అలియాస్ పంచశీల (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. ముంబాయిలోని ఉల్షానగర్‌కు చెందిన దీపక్ బోర్సే అలియాస్ దీపక్ గత కొన్నేళ్లుగా స్నేహితులు. రానురాను స్నేహితులు పంచశీల, దీపక్ ప్రేమలో పడ్డారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.