National

చంద్రయాన్ 2_ వైఫల్యానికి ముందే.ఇస్రో ఖాతాలో ఓ క్రాష్ ల్యాండింగ్

ఓటమి గెలుపుకు పాఠం వేస్తుంది. అపజయం విజయాలకు బాటలు పరుస్తుంది. పరాజయం సాధించే జయాలకు స్ఫూర్తి గీతం అవుతుంది. ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్_3 కూడా ఇస్రోకు పై అనుభవాలే నేర్పింది.

కొన్ని సంవత్సరాల క్రితం చంద్రయాన్_2 ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేల కూల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఇస్రో కూల్చేసిన శాటిలైట్లలో ఇదే మొదటిది కాదు. చంద్రయాన్_1ను పది సంవత్సరాల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. 2008 నవంబర్ 14 న మధ్యాహ్నం వేళ బెంగళూరు కేంద్రంగా ఈ విస్ఫోటనానికి నాంది పలికింది. దీనికంటే ముందు అక్టోబర్ 22న చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్దమైనది. భూ కక్ష్య కు అవతలి కి శాటిలైట్ పంపడం భారత్ కు అదే తొలిసారి. అప్పటిదాకా రష్యా, అమెరికా, జపాన్, యూరప్ స్పేస్ ఏజెన్సీల పేరిట ఉన్న ఘనత అది. చంద్రుడు పై నీటి ఆనవాళ్ళను తొలిసారిగా ప్రపంచానికి చూపించిన ప్రయోగంగా చంద్రయాన్ చరిత్రలో నిలిచిపోయింది. అందరికీ తెలిసిన ఈ ఘనత వెనక బయటకు తెలియని మరో గాథ బాగుంది.

చంద్రయాన్ లో భాగంగా 32 కిలోల బరువున్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ను ఇస్రో చంద్రుడికి మీదకి పంపింది. 2008 నవంబర్ 17 రాత్రి 8 గంటల సమయంలో ఇంపాక్ట్ ప్రోబ్ ను చంద్రుడి మీద కావాలనే కుప్ప కూల్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా చంద్రుడికి దాదాపు 100 కిమీఎత్తు నుంచి తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. చంద్రయాన్ కక్ష్య నుంచి క్రమంగా విడిపోవడం మొదలుపెట్టింది. దానిలోని స్పినప్ రాకెట్లు జీవం పోసుకుని గర్జించాయి. అయితే, ప్రోబ్ వేగాన్ని పెంచేందుకు మాత్రం కాదు, వీలైనంత తగ్గించేందుకు. చంద్రుడి ఉపరితలం కేసు తిప్పి అనుకున్న విధంగా క్రాష్ చేసేందుకు.

ఎట్టకేలకు చంద్రయాన్ మిషన్ నుంచి విడిపోయి అరగంటకు క్రాష్ ల్యాండ్ అయింది. ప్రోబ్ కథ అలా కంచికి చేరింది. అంతదాక అందరాని చందమామతో కరచాలనం చేసి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రోబ్ లో ఇస్రో మూడు రకాల పరికరాలను పంపింది. ఫోటోలు, వీడియోలు తీసి భూమికి పంపే ఇమేజింగ్ సిస్టం. ప్రోబ్ చంద్రుడి పైకి పడ్డ వేగాన్ని కొలిచేందుకు రాడార్ అల్టి మీటర్, చంద్రుడి వాతావరణాన్ని విశ్లేషించేందుకు మాస్ స్పెక్ట్రం మీటర్. కూల్చివేయడమే అంతిమ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన విఫల చంద్రయాన్ మిషన్ తర్వాతి రోజుల్లో చంద్రయాన్_2,3 ప్రయోగాలకు బాటలు వేసింది. ఆగస్టు 23న చంద్రుడిపై సగర్వంగా దిగి చంద్రయాన్_3 సాధించబోయే అంతిమ విజయం కోసం దేశం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.