National

ఒక్క ముస్లీం ఓటు మిస్ అయితే బీజేపీ రెండు ప్లస్ పాయింట్లు, ఆలోచించండి, జమీర్ !

బెంగళూరు: ఆరు నెలల ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (jameer ahmed) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైనార్టీ (muslim) వర్గం కాంగ్రెస్‌కు వంద శాతం అండగా నిలవాలని మనవి చేశారు.

సండూర్‌లోని చప్పరద్‌ గ్రామంలో జామియా మసీద్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాదీమహల్‌ పనులను పరిశీలించిన అనంతరం జమీర్ అహ్మద్ ఖాన్ ముస్లీం (muslim) మత పెద్దలతో మాట్లాడారు.

పొత్తులతో ఉన్నదే ఊసిపోతోంది, అధికార పార్టీలోకి జంప్ జిలాని, ఆరా తీస్తున్న హైకమాండ్!

అనంతరం జరిగిన ముస్లీం (muslim)మతం నాయకుల సమావేశంలో మంత్రి జమీర్ అహ్మద్ (jameer ahmed)మాట్లాడుతూ మన మతం వాళ్లు ఓటింగ్‌పై (votes) నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఒక్క ఓటు వేయకుంటే బీజేపీకి రెండు ఓట్లు వస్తాయి. దేశ ప్రయోజనాల కోసం మన ముస్లీం (muslim) సమాజమంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, లోక్‌సభ ఎన్నికల్లోనూ మైనారిటీ (muslim) వర్గం కాంగ్రెస్‌కు అండగా నిలవాలని మంత్రి జమీర్ అహ్మద్ (jameer ahmed) మనవి చేశారు.

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే శాంతిభద్రతలు కాపాడటానికి సాధ్యం అవుతుందని, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రజల కోసం అభివృద్ధి ప్రణాళిక రూపొందించిందని మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య (cm) నేతృత్వంలోని ప్రభుత్వం హామీ (muslim)పథకాన్ని అమలు చేసి కోట్లాది కుటుంబాలకు సాయం అందజేసిందని జమీర్ అహ్మద్ (jameer ahmed) చెప్పారు.

 

జామియా మసీదులో నిర్మిస్తున్న షాదీ మహల్‌ను (muslim) త్వరితగతిన పూర్తి చేసేందుకు రెండు దశల్లో రూ 50 లక్షలు విడుదల చేయనున్నామని, 11 మసీదుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపితే అందుకు అవసరమైన ఆర్థిక సాయం వక్ఫ్ బోర్డు (muslim) ద్వారా అందజేస్తామని మంత్రి జమీర్ అహ్మద్ (jameer ahmed) తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ మైనార్టీ (muslim)వెల్ఫేర్ అండ్ మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా విద్య, స్వయం ఉపాధి కోసం అనేక పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జమీర్ అహ్మద్ ముస్లీంలను కోరారు.