National

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కొత్త మద్యం (liquor) షాపులను తెరిచేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు చేసిన వేర్వేరు ప్రకటనలు గందరగోళం సృష్టించాయి.

కాంగ్రెస్ (congress) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 1, 000 మద్యం (liquor) దుకాణాలను తెరవాలని భావిస్తోందన్న ఊహాగానాల మధ్య, అటువంటి నిర్ణయం తీసుకోబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

అయితే రాష్ట్రంలో తగిన చోట్ల మద్యం (liquor) దుకాణాలకు కొత్త లైసెన్సులు జారీ చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (dk shivakumar) తెలిపారు. చిత్రదుర్గలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం సిద్ధరామయ్య (siddaramaiah) ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలను తెరవడం లేదన్నారు. మద్యం షాపుల ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అయితే కొత్తగా మద్యం షాపులను తెరవబోమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

చిత్రదుర్గలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం సిద్ధరామయ్య (siddaramaiah)ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాన్ని తెరవడం లేదన్నారు. మద్యం (liquor) షాపుల ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించే ప్రతిపాదనను పరిశీలించి కొన్ని చోట్ల లైసెన్సులు జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar) తెలిపారు. కర్ణాటకలో గత 30 ఏళ్లుగా మద్యం లైసెన్స్‌లు ఇవ్వడం లేదని డీకే శివకుమార్ గుర్తు చేశారు.

 

కర్ణాటకలోని గ్రామాల్లో బార్లు (liquor) తెరవడం లేదని, మేము ప్రతిపాదనను పరిశీలించి తగిన ప్రాంతాల్లో మాత్రమే కొత్త మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తామని డీకే శివకుమార్ (dk shivakumar) చెప్పారు. కర్ణాటకలో ఎక్కువగా మద్యం దుకాణాలను తెరవకూడదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందించారు. తాగుబోతులను ఎవరూ ఆపలేరని, వాళ్లను అడ్డుకోవడం ఎవ్వరి వలన సాధ్యం కాదని డీకే శివకుమార్ ఆయన శైలిలో సమాధానం ఇచ్చారు.

టెక్కీకి లక్షల్లో జీతం, కేరళ వెళ్లి మలయాళం మసాజ్ చేసుని వస్తే ఇంట్లో ?, సీసీటీవీల్లో !

ఇటీవల 3 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీ స్థాయిలో మద్యం (liquor) దుకాణాలకు లైసెన్సు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంది. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను, బెల్ట్ షాపులను అరికట్టేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలను పరిశీలిస్తోందని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి (minister) ఆర్‌బీ. తిమ్మాపూర్ గత నెలలో మీడియాకు చెప్పారు.