National

కరెంట్ కట్ చేస్తే మీ ఆఫీసులకు తాళం వేస్తామని మాజీ సీఎం వార్నింగ్, సిగ్గుమాలిన ప్రభుత్వంతో !

బెంగళూరు: ప్రభుత్వం రైతులకు ఏడు గంటల పాటు త్రీఫేజ్‌ కరెంటు (electricity) ఇవ్వకుంటే విద్యుత్‌ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన చేపడతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay) కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బుధవారం చిక్కబళ్లాపురంలో మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ ఆద్వర్యంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

బిగ్ బాస్ లో ఎంట్రీకి ఎమ్మెల్యే ఎంత డబ్బులు తీసుకున్నారంటే ?, సినిమా డైలాగులతో రచ్చ చేసి !

మాజీ మంత్రి సుధాకర్ నేతృత్వంలో బీజేపీ నిర్వహించిన రైతుల నిరసన ర్యాలీలో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay)పాల్గొని మాట్లాడారు. విద్యుత్ (electricity) మా హక్కు, బియ్యం మా హక్కు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మా హక్కులను హరిస్తోందరని, విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా విఫళం అయ్యిందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay)ఆరోపించారు.

ఇప్పుడు ఇంధన శాఖ ఎలా పని చేస్తుందో అధికారులను అడిగి తెలుసుకుంటానని, సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వంలో రైతులకు విద్యుత్ (electricity) అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay) దుయ్యబట్టారు. మేం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ శాఖకు పది వేల కోట్ల రూపాయలు కేటాయించాం అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ప్రత్యేక దర్శనాలు రద్దు, బైక్ లు బ్యాన్ ఈవో రెడ్డి !

ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) ఎలాంటి గ్రాంట్ కేటాయించలేదు. గ్రాంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. బొగ్గు కొనేందుకు డబ్బులు లేవు. రాష్ట్రంలోని రైతులకు కేవలం రెండు గంటలే కరెంటు (electricity) ఇస్తున్నారని, మూడు నెలల్లో రెండు సార్లు కరెంటు బిల్లులు పెంచారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay)మండిపడ్డారు.

కర్ణాటకలోని ప్రతి ఒక్కరికి పది కేజీల ఉచిత బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah) చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు కిలోలు ఇస్తోంది. కాంగ్రెస్ (Congress) అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. 10 కిలోల బియ్యం ఇచ్చినా ప్రజలు ఆశీర్వదించరని, మూడు కేజీలు బియ్యం ఇచ్చే వారిని ఏం చేయాలి, గృహ లక్ష్మి యోజన కింద రూ 2, 000 ఇస్తానని చెప్పారు, అయితే చాలా మందికి ఆ డబ్బులు అందలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay)ఆరోపించారు. ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన చాలా మంది బీజేపీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.