National

సీఎం సత్యహరిశ్చంద్రుడు అయితే ఏ దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇస్తుందో చూడాలి, మాజీ సీఎం సెటైర్!

బెంగళూరు/ మైసూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నేను సత్యహరిశ్చంద్రుడు అని చెప్పుకునే సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ఇప్పుడు ఐటీ శాఖ (IT Raids) దాడుల్లో చిక్కిన కేసును ఎవరితో దర్యాప్తు చేయిస్తారు ?

అంటూ కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి (hd kumaraswamy) సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ విషయమై సోమవారం మైసూరులో (Mysuru0 మీడియాతో మాట్లాడిన హెచ్ డీ కుమారస్వామి కర్ణాటకలోని (Karnataka)ప్రభుత్వ శాఖలు, అందులో పని చేసే అధికారులు అవినీతిలో పోటీపడుతున్నాయని ఎద్దవే చేశారు. ఐటీ శాఖ దాడుల్లో అవినీతిపరుల ఇళ్లల్లో డబ్బులు చిక్కడం నిజం కాదా ?, వాటికి ఇంకా రుజువులు కావాలా? అని మాజీ సీఎం కుమారస్వామి (hd kumaraswamy) ప్రశ్నించారు.

 

తొలిరోజు చిక్కిన డబ్బులు ఎస్.ఎస్.టి. పన్ను డబ్బు, రెండో రోజు చిక్కిన డబ్బు వైఎస్ టీ డబ్బు అని, ఈ డబ్బు ఎవడి అబ్బ సొమ్ము కాదని, ఈ డబ్బు బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల సొమ్ము కాదని, ఇది పూర్తిగా కర్ణాటక (Karnataka) రాష్ట్ర ప్రజల సొమ్ము అని మాజీ సీఎం కుమారస్వామి (hd kumaraswamy) అన్నారు. నేను సత్య హరిశ్చంద్రుడిని, సిద్ధ పురుషుడిని అని నిత్యం గొప్పలు చెప్పుకునే సిద్దరామయ్య (siddaramaiah) ఇప్పుడు ఏ దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తారో బహిరంగంగా ప్రజలకు చెప్పాలని మాజీ సీఎం కుమారస్వామి (hd kumaraswamy) నిలదీశారు.

వ్యవసాయ శాఖ అధికారులు గవర్నర్‌కు లేఖ రాసిన కేసు ఏమైంది?, ఆ లేఖ గురించి ఏం జరిగిందో విచారణ చేశారా? ఇప్పుడు దొరికిన డబ్బుపై విచారణ జరిపించడానికి సీఎం సిద్దరామయ్య సిద్దం అయ్యారా ? అని మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ (congress) ప్రభుత్వాన్ని నిలదీశారు. ఐటీ దాడుల్లో డబ్బులు సంపాదించింది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కాదు. అయితే ఆ డబ్బు ఎవరిదనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుమారస్వామి (hd kumaraswamy) చెప్పారు.

 

సరైన విచారణ జరిపితే అన్నీ బయటకు వస్తాయని, ఐటీ శాఖ (it raids) సోదాల్లో దొరికిన డబ్బుతో మైసూర్‌కు సంబంధం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని, దీనిపై కూడా విచారణ జరిపించాలని మాజీ సీఎం కుమారస్వామి (hd kumaraswamy) డిమాండ్‌ చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ డబ్బులు అడగలేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారని కుమారస్వామి ఎద్దేవ చేశారు.

మీ కాంగ్రెస్ (congress) పార్టీ హైకమాండ్ అడగకపోతే ఇంత డబ్బు వసూలు చేసి ఎవరికి పంపించాలని అనుకున్నారు ? అని కుమారస్వామి సీఎం (CM) సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటీవల ఐటీ దాడుల్లో బెంగళూరులో చిక్కుతున్న డబ్బుల విషయంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పలేక కర్ణాటకలోని (Karnataka) సిద్దరామయ్యతో (siddaramaiah) పాటు ప్రభుత్వంలోని పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.