National

81.5 కోట్ల మంది ఆధార్ డేటా చోరీ…

దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.

 

డేటా చౌర్యానికి గురైన విషయం అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెక్యూరిటీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆధార్ లో నిక్షిప్తమైన 81.5 కోట్ల మంది బయోమెట్రిక్ వివరాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్టు సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో ప్రకటన చేయడం కలకలానికి దారితీసింది. దీంతో మన సైబర్ భద్రత డొల్లతనం మరోసారి బయటపడింది.

 

ఆధార్‌తో పాటు పాస్ పోర్టు వివరాలను చేజిక్కించుకున్నట్టు pwn0001 అనే పేరుతో ఓ హ్యాకర్ డార్క్‌వెబ్‌లో పోస్టు చేశాడని రీసెక్యూరిటీ వెల్లడించింది. అయితే ICMR వద్ద ఉన్న భారతీయుల వివరాలనే ఆ హ్యాకర్ తస్కరించినట్టు తెలుస్తోంది.