భారత ప్రభుత్వం నూతన ప్రసార సేవల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌తో సహా వివిధ ప్రసార సేవలకు నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేస్తుంది. ఈ బిల్లు ఆమోదించబడిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను కూడా కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రిస్తుంది.
సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం కొత్త ముసాయిదా చట్టం గురించి తెలియజేస్తూ X (గతంలో ట్విటర్)లో ఇలా వ్రాశారు. “’ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం గౌరవప్రదమైన ప్రధానమంత్రి దృష్టిని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా ఉంది. ఈ కీలక చట్టం మా ప్రసార రంగానికి నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునీకరించిందని పేర్కొన్నారు. పాత చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను ఏకీకృతమైన, భవిష్యత్తు-కేంద్రీకృత విధానంతో భర్తీ చేస్తుందన్నారు. ‘కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలు’ ఏర్పాటు చేయడం, అంతర్ విభాగ కమిటీని ‘ప్రసార సలహా మండలి’గా మార్చడం కొత్త చట్టంలోని కీలక అంశం.
ప్రకటన కోడ్ , కార్యక్రమ కోడ్‌కు సంబంధించిన ఉల్లంఘనలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి కొత్త ప్రసార సలహా మండలిని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కొత్త మండలికి రంగం నిపుణుడు అధిపతిగా ఉంటారు మరియు ప్రముఖ వ్యక్తులు మరియు అధికారులను కూడా కలిగి ఉంటారు. రాయిటర్స్‌లో పేర్కొన్న కొత్త చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ప్రకారం.. ప్రతి ప్రసారదారు లేదా ప్రసార నెట్‌వర్క్ ఆపరేటర్ వివిధ సామాజిక సమూహాల నుండి సభ్యులతో కూడిన కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ (CEC)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
స్వయం-నియంత్రణ సంస్థలపై ప్రత్యేక దృష్టితో.. కొత్త బిల్లులో అటువంటి సంస్థలు తమ సభ్యులకు నిబంధనలు, నిబంధనల ఉల్లంఘన కోసం ఆర్థిక, ఆర్థికేతర జరిమానాల ద్వారా శిక్షించే అధికారం ఉంది. బిల్లులో చేర్చబడిన పెనాల్టీలలో హెచ్చరిక, ఆపరేటర్లు లేదా ప్రసారకర్తలకు ద్రవ్య జరిమానాలు, సలహా లేదా నిందలు ఉన్నాయని నివేదిక జోడించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. జైలు శిక్ష లేదా జరిమానాలు కూడా విధించే అవకాశం ఉందని పేర్కొంది.