National

పీఎం సూర్య ఘర్ .. 300యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్ కోసం ఇలా అప్లై చేసుకోండి..!!

భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు చెప్పారు. సౌరశక్తి వినియోగాని,కి సుస్థిర ప్రగతిని పెంచడానికి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనను ప్రారంభిస్తున్నట్టు నిన్న ప్రధాన నరేంద్ర మోడీ ప్రకటించారు.

 

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఉచిత కరెంటును ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రూఫ్ టాప్ సోలార్ స్కీంను ప్రకటించి, కోటి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ప్రకటించడంతో ఈ పథకం కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే pmsuryaghar.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఆ తర్వాత అందులో క్విక్ లింక్స్ లోకి వెళ్లి అప్లై ఫర్ రూట్ ఆఫ్ సోలార్ అనేది క్లిక్ చేయాలి. ఆపై రిజిస్టర్ చేసుకోమని, రిజిస్టర్ చేసుకున్నవారు లాగిన్ చేసుకోమని కనిపిస్తాయి.

 

రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరును, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ నెంబర్ ను, మొబైల్ నెంబర్ను, మెయిల్ ఐడిని అందులో ఎంటర్ చేయాలి. ఆ తరువాత రెండవ స్టెప్ లో కన్జ్యూమర్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తో లాగిన్ చేయాలి. రూఫ్ టాప్ సోలార్ కోసం అందులో వచ్చిన ఫామ్ ను అన్ని వివరాలతో పూర్తిచేసి దరఖాస్తు చేసుకోవాలి.

 

ఆపై డిస్కం అనుమతులు వచ్చేవరకు వెయిట్ చేయాలి. డిస్కం నుండి అనుమతి రాగానే నమోదిత విక్రేత నుండి మీ ఇంటిపై సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆపై ప్లాంట్ వివరాలని పోర్టల్ లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి. నెట్ మీటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిస్కౌంట్ అధికారులు మరోమారు తనిఖీలు చేసి పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

 

ఈ రిపోర్టు వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా క్యాన్సిల్ చేసిన చెక్ ను పోర్టల్ లో సబ్మిట్ చేయాలి. అప్పుడు 30 రోజుల్లోగా మీకు మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. పోర్టల్ లోకి వెళితే ఎప్పుడు ఏం చేయాలో అన్ని డీటెయిల్స్ అర్థమయ్యేలా పొందుపరిచారు. మరెందుకాలస్యం సూర్య ఘర్ ను ఆహ్వానించండి.