National

7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.

 

రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. 10 లక్షల 50 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. కోటిన్నర మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.

 

పురుష ఓటర్లు..49.7 కోట్లు

మహిళా ఓటర్లు..47.1 కోట్లు

1.8 కోట్ల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు

85 ఏళ్లు దాటిన వారు 82 లక్షల మంది

 

ట్రాన్స్ జెండర్స్.. 48 వేల మంది

యంగ్ ఓటర్లు..19.74 కోట్లు

వందేళ్లు దాటిన వారు 2.18 లక్షల మంది

సర్వీస్ ఓటర్లు 19.1 లక్షల మంది

దివ్యాంగ ఓటర్లు 88. 4 లక్షల మంది

 

జమ్మూకాశ్మీర్ లో కూడా ఎన్నికల నిర్వహించాలని రాజీవ్ కుమార్ తెలిపారు. జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.

 

అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో మే 13 న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 4 న కౌంటింగ్ జరగుతుందన్నారు.

 

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19న మొదలవుతుంది. ఆ రోజు తొలి దశ పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 1 ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఆ రోజుతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4న కౌంటింగ్ చేపడతారు. జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.

 

7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు..

తొలి దశ పోలింగ్‌ తేదీ ఏప్రిల్‌ 19

 

తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్

 

రెండో దశ పోలింగ్‌ తేదీ ఏప్రిల్‌ 26

 

రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్

 

మూడో దశ పోలింగ్‌ తేదీ మే 7

 

మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాల్లో పోలింగ్

 

నాలుగో దశ పోలింగ్‌ తేదీ మే 13

 

నాలుగో దశలో 10 రాష్ట్రాల్లో 96 స్థానాల్లో పోలింగ్

 

ఐదో దశ పోలింగ్‌ తేదీ మే 20

 

ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో పోలింగ్

 

ఆరో విడత పోలింగ్‌ తేదీ మే 25

 

ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో పోలింగ్

 

ఏడో దశ పోలింగ్‌ తేదీ జూన్‌ 1

 

ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్.

 

కౌంటింగ్ తేదీ జూన్ 4