National

లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

భారతీయుల వివాహాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పెళ్లి భోజనం నుంచి ఆచారాల వరకు ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారు. వధువు అయితే తన అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లిలో దగదగమెరిసిపోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి చీర నుంచి చేతులకు పెట్టుకునే మెహందీ వరకు ప్రతిఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని కోరకుంటుంది.

అయితే ఉత్తరాఖండ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కాబోయే కోడలికి అత్తగారు లెహెంగా తీసుకువచ్చారు. అయితే ఆ లెహెంగా పెళ్లికూతురికి నచ్చలేదు. దీంతో పెళ్లి వదంటూ మారం చేసింది. ఇంత చీప్ లెహంగా తీసుకువస్తారంటూ ఆగ్రహంతో పెళ్లినే రద్దు చేసుకుంది. పెళ్లికి కొన్నిరోజుల ముందు వరుడి కుటుంబం పదివేలు పెట్టి లెహెంగాను కొన్నారు. అది కోడలికి పంపించారు. ఇంత చీప్ లెహెంగా ధరించి పెళ్లి చేసుకుంటే తమ పరువు ఏమై పోతుంది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పెళ్లి కూతురు.

లెహెంగా నచ్చకుంటే పెళ్లినే రద్దు చేసుకుంటుందా అంటూ వరుడి కుటుంబం వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఎవ్వరూ తగ్గలేదు. పోటాపోటీకి కుస్తికి దిగారు. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. కానీ వధువు మాత్రం ఈ పెళ్లి వద్దంటే వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఒక లెహెంగాతో పెళ్లి రద్దైన ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది.