POLITICS

సిద్దూ సీఎం అని డీకే శివకుమార్ తోనే చెప్పించిన కాంగ్రెస్, స్కెచ్ అంటే అదేనా మేడమ్?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను ప్రకటిస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్ చెప్పడం ఆయన అభిమానులు, ఆయన వర్గంలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

గురువారం రాత్రి సీఎల్ పీ సమావేశం జరిగిన తరువాత కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అని ప్రకటించారు.

ముచ్చటగా మూడు కారణాలతో సీఎం రేసు నుంచి తప్పుకున్నా, డీకే శివకుమార్ మాటతో!

సీఎల్ పీ సమావేశం జరుగుతున్న సమయంలో సిద్దరామయ్య ఏం మాట్లాడుతారు ?, డీకే శివకుమార్ ఏం మాట్లాడుతారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, ఎంపీలు అందరూ ఆసక్తిగా ఎదరు చూశారు. అయితే ఎలాంటి గొడవలు లేకుండా సీఎల్ పీ సమావేశం పూర్తి అయ్యింది. కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అని డీకే శివకుమర్ నోటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ చెప్పించింది.

అయితే అంతకు ముందు కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ చెప్పిన మాటలకు డీకే శివకుమార్ వర్గీయుల్లో జోష్ పెరిగిపోయింది. తాను సీఎం కావాలని అనుకుంటున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదురైనాయని, కష్టకాలంలో తనను డీకే శివకుమార్ ఆదుకున్నారని, వయసులో ఉన్న డీకే శివకుమార్ కు భవిష్యత్తులో మంచిమంచి పదవులు వెతుక్కుంటూ వస్తాయని సుశీల్ కుమార్ షిండే అన్నారు.

కర్ణాటకలో ఏ కులానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే , రెడ్డి వర్గంలో!

డీకే శివకుమార్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కితాబు ఇచ్చారు. సీఎల్ పీ సమావేశం పూర్తి అయిన తరువాత సిద్దరామయ్య, డీకే శికుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాల బెంగళూరులోని రాజ్ భవన్ కు వెళ్లి కర్ణాటక గరవ్నర్ ను కలిశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న మాకు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు మనవి చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవసరం అయ్యే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది శాసన సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి కర్ణాటక గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద పక్కాప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డీకే శివకుమార్ ను లొంగదీసుకున్న సిద్దరామయ్యనే సీఎం చేసింది.