POLITICS

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు

  • రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు
  • 5 గ్రామాల పరిధిలో భూమి ఇళ్లస్థలాలకు వినియోగం..
  • సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ జోన్లలో మార్పు
  • డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం..
  • నవంబర్‌ 11 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ..

అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లోని జోన్‌లలో మార్పులు చేసింది.ఈ మేరకు శుక్రవారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్‌ హౌసింగ్‌ జోన్‌తోపాటు రెసిడెన్షియల్‌ జోన్‌ నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త జోన్‌ను తీసుకురానుంది. దీనిపై నవంబర్‌ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.