APPOLITICSTELANGANA

YS షర్మిలకి బెయిల్.!

ఉదయం నుంచీ హైడ్రామా నడిచింది. వైఎస్ షర్మిల, పోలీసుల కంట పడకుండా సొంత వాహనంలో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్ళగా, అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వాహనం దిగేందుకు నిరాకరించిన షర్మిలను, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సాయంత్రం వైఎస్ షర్మిల సహా, ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు, వైఎస్ షర్మిల సహా ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతో కథ సుఖాంతమయినట్లయ్యింది. రిమాండ్ తిరస్కరించిన న్యాయస్థానం కాగా, షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు, ఆమెకు రిమాండ్ విధించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్, షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేయడం జరిగింది. దాంతో, పోలీసులు దాఖలు చేసిన రిమాండ్‌ని న్యాయస్థానం తిరస్కరించినట్లయ్యింది. రోడ్డుపై షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు న్యూసెన్స్ క్రియేట్ చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, తప్పుడు కేసులు బనాయించారనీ, జరిగిన ఘటనకీ నమోదు చేసిన కేసులకూ సంబంధం లేదని వైఎస్ షర్మిల తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మొదలైన రగడ, హైద్రాబాద్ వరకూ పాకింది. కాగా, షర్మిల పాదయాత్ర కు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన దరిమిలా, షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తారా.? లేదా.? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.