తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లో ముసలం ఏర్పడింది అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి అతీతంగా భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డి పై అసంతృప్తితోనే ఆ ఎమ్మెల్యేలు అయ్యారని ముఖ్యమంత్రి కి మంత్రి గురించి ఫిర్యాదు ఇవ్వాలని ఉద్దేశంతో వారు భేటీ అయ్యారని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. భేటీ అయిన వారిలో ఎవరున్నారంటే.. మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, భేతి సుభాష్ రెడ్డి మరియు అరికెపూడి గాంధీ లు ఉన్నారు.
ఈ ఐదుగురు కూడా గత కొన్నాళ్లుగా మంత్రి మల్లారెడ్డి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తమకు చెందిన పనులు చేసి పెట్టడం లేదని.. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఓకే చెప్పడం లేదని వారు అసంతృప్తితో ఉన్నారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరు వెనకాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి కొందరు మాత్రం వీరు బిజెపిలో జాయిన్ అయ్యేందుకు చర్చలు జరుపుతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.